Share News

ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:51 PM

మహిళల టీ20 ఆసియా కప్2026 టోర్నీలో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన అదరగొడుతున్నారు. పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన శతకంతో రాణించడమే కాకుండా.. టీ20 క్రికెట్‌లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.

ఆ రికార్డు బ్రేక్ చేస్తానని ఊహించలేదు: స్మృతి మంధాన
Smriti Mandhana

స్పోర్ట్స్ డెస్క్: మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించారు. భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేశారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ (10,868 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, ఆమెను వెనక్కి నెట్టి స్మృతి మంధాన (10,880 పరుగులు) నయా రికార్డు సృష్టించారు.


ఈ ఘనతపై మంధాన స్పందిస్తూ.. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ రికార్డు బద్దలకొట్టానన్న విషయం తెలియదని, మ్యాచ్ ముగిశాక తెలిసిందని అన్నారు. చిన్నతనంలో మిథాలీ రాజ్‌ను ఆదర్శంగా తీసుకుని పెరిగిన తనకు, ఆమె రికార్డును దాటడాన్ని నమ్మలేకపోతున్నాని తెలిపారు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్-2లో ఇద్దరూ భారతీయ క్రికెటర్లే ఉండటం సంతోషంగా ఉందంటూ స్మృతి భావోద్వేగానికి లోనయ్యారు.


మిథాలీ రికార్డు బద్దలు కొట్టడంతో పాటు, ఇదే టోర్నీలో స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. మహిళల టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. గతంలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు పేరిట ఉన్న రికార్డును మంధాన అధిగమించారు. 2024లో మలేషియాపై చమరి 119 పరుగులతో అజేయంగా నిలిచారు.


మంధాన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన హాంకాంగ్ జట్టును భారత బౌలర్లు కేవలం 56 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో టీమిండియా రెండు భారీ విజయాలను నమోదు చేసుకుంది. ఈ విజయంతో మహిళల భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ స్థాయిలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.


ఇవి కూడా చదవండి:

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

Updated Date - Sep 04 , 2026 | 01:58 PM