Share News

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:55 AM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీను బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా ప్రశంసించారు. అంతేకాక క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు.

సచిన్ లాంటి గొప్ప కెరీర్‌ను వైభవ్ నిర్మించుకోవాలి: బీసీసీఐ
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 15 ఏళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతేకాక అతి పిన్న వయసులో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా వైభవ్ కెరీర్‌పై బీసీసీఐ దృష్టి పెట్టింది. సచిన్ లాంటి అద్భుతమైన కెరీర్ వైభవ్ నిర్మించుకోవాలని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సూచించారు.


గురువారం బీసీసీఐ రివ్యూ మీటింగ్‌ జరిగింది. అనంతరం దేవజిత్ సైకియా విలేకర్లతో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తావననూ తీసుకొచ్చారు. ఓ 15 ఏళ్ల కుర్రాడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకొచ్చినందుకు బీసీసీఐ గర్వపడుతోందని తెలిపారు. తన సత్తా ఏంటో ఇప్పటికే అభిమానులకు వైభవ్ చూపించాడని, మున్ముందూ ఇలానే సరైన దిశలో సాగాలని కోరుకుంటున్నామని సైకియా పేర్కొన్నారు.


వైభవ్ సూర్యవంశీ కొన్ని మ్యాచులకే పరిమితం కాకుండా.. సుదీర్ఘమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని సైకియా సూచించారు. అందుకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను వైభవ్‌ స్ఫూర్తిగా తీసుకోవాలని వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వైభవ్ వేసే ప్రతి అడుగును అన్ని కోణాల్లో నిశితంగా గమనిస్తూనే ఉంటామని, అతడి భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టిసారించిందని దేవదత్ సైకియా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

టీ20 క్రికెట్‌లో తెలుగు తేజం శ్రీ చరణి అరుదైన ఫీట్

విరాట్ కొడుకుకి 'అంకుల్'గా మారిన శుభ్‌మన్ గిల్

Updated Date - Sep 04 , 2026 | 12:03 PM