Share News

సంతానం కోసం ఆరాటం

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:03 AM

పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి మనిషిని విషతుల్యం చేస్తుంటే, మరో వైపు ఆలస్య వివాహాలు సంతానోత్పత్తికిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

సంతానం కోసం ఆరాటం
World IVF Day

  • ఆలస్య వివాహాలు, కాలుష్య ప్రభావంతో పెరుగుతున్న సమస్యలు

  • ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్న దంపతులు

  • వంద మందిలో 15 మందికి ఐవీఎఫ్‌

  • నేడు ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి మనిషిని విషతుల్యం చేస్తుంటే, మరో వైపు ఆలస్య వివాహాలు సంతానోత్పత్తికిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పురుషుల్లో వీర్యకణాలు, ఆడవారిలో అండోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. దీంతో సంతానం కోసం ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్లకు వచ్చే దంపతులు పెరిగిపోతున్నారు. ఒక్కో సెంటర్‌కు ప్రతీ రోజు 50 నుంచి 100 మందికిపైగా దంపతులు వస్తున్నారంటే తీవ్రత ఎలా ఉందో తెలుస్తుంది. దేశంలో సుమారు 2.8 కోట్ల మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రతీ ఏడాది జూలై 25న ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1978లో ప్రపంచంలోనే తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ లూయిస్‌ బ్రౌన్‌ జన్మించిన రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


city7.2.jpgపలు సమస్యలు

మహిళలలో పీసీవోడీ, ఫ్రైబాయిడ్స్‌, ఇన్‌ఫెర్టిలిటీ, ఎండోమెట్రియాస్‌, స్థూకాలయం, వయస్సు పెరిగిన తర్వాత గర్బం దాల్చడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే అబార్షన్లు కూడా సంతానత్పోత్తికి అంటకమవుతోంది. రసాయనిక పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల టీనేజీలో ఆడపిల్లలు బరువు పెరగడం వల్ల వివాహం జరిగిన తరువాత అది అండోత్పత్తికి సమస్యగా మారుతోంది. అలాగే పురుషుల్లో ఆలస్య వివాహాలు సంతానంపై ప్రభావం చూపుతున్నాయి. వీర్యం క్వాలిటీ, ఇన్‌ఫెక్షన్స్‌, వెరికేస్‌, ఒత్తిడి, అధిక బరువు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అల్కాహాల్‌, ధూమపానం వంటి వినియోగం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతోంది.


రెండు పద్ధతుల్లో ఐవీఎఫ్‌

ఐదు దశాబ్దాల ప్రయాణంలో ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది. లక్షలాది దంపతులకు తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని కల్పించింది. టైమ్‌ ల్యాప్స్‌ ఎంబ్రియో మానిటరింగ్‌, అత్యాధునిక ఇంక్యుబేటర్లు, బ్లాస్టోసిస్ట్‌ కల్చర్‌, ఎంబ్రియో ఫ్రీజింగ్‌, లేజర్‌ అసిస్టెడ్‌ హ్యాచింగ్‌, ప్రీ ఇంప్లాంటేషన్‌, జన్యు పరీక్షలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ఎంబ్రియో ఐవీఎఫ్‌ విజయశాతాన్ని మరింత పెంచుతున్నాయి. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇంట్రా యుటిరైన్‌ ఇన్‌సెమినేషన్‌(ఐయూఐ), ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) అనే రెండు రకాల రెండు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు.


30 ఏళ్లలోపు గర్భందాల్చక పోతే..

సంతానాలేమీ సమస్యలతో వచ్చే దంపతుల్లో ఒకప్పుడు వందలో ఒకరికి ఇన్‌ఫెర్టిలిటి ప్రక్రియ అవసరం ఏర్పడితే, ఇప్పుడు 10 నుంచి 15 మందికి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 30 ఏళ్లలోపు దంపతులు ఏడాదిపాటు సహజంగా గర్భం దాల్చకపోతే ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించాలి. సమస్యను ముందుగానే గుర్తిస్తే విజయావకాశాలు బాగుంటాయి.

  • కె. శిల్పిరెడ్డి, క్లినికల్‌ డైరెక్టర్‌ అబ్‌స్ట్రిక్స్‌ గైనకాలజీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌, కిమ్స్‌ కడల్స్‌, కొండాపూర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ

లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 11:27 AM