టీజీఎస్పీడీసీఎల్ నెట్‌వర్క్ ఇక డిజిటలైజ్!
ABN , Publish Date - Jul 25 , 2026 | 10:33 AM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్ వేదికలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది.
విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు జీఐఎస్ మ్యాపింగ్
మొదటి దశలో క్యూర్ పరిధిలో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పూర్తి నెట్‌వర్క్‌ను డిజిటల్ వేదికలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా టీజీఎన్‌ఎంఎస్ (టీజీఎస్పీడీసీఎల్ జీఐఎస్ నెట్‌వర్క్ మానిటరింగ్ సిస్టం) వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. క్యూర్ పరిధిలోని 33 కేవీ, 11 కేవీ, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్), రింగ్ మెయిన్ యూనిట్లు (ఆర్‌ఎంయూ), ఏబీ స్విచ్‌లు, సెక్షన్ లైజర్లు, ఆటో రీక్లోజర్లు, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లతోపాటు దక్షిణ డిస్కం మొత్తం నెట్‌వర్క్, ఆస్తులను మొబైల్ యాప్‌లో జీఐఎస్ మ్యాపింగ్ చేపడుతున్నారు.
నెట్‌వర్క్ మానిటరింగ్ సిస్టమ్ అందుబాటులో వస్తే సమీక్షా సమావేశాల్లో ఏ అంశం అయినా ఆన్‌లైన్ వేదికగా చూసుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో మెట్రోజోన్ పరిధిలోని 27 ఈహెచ్‌టీఎస్ సబ్‌స్టేషన్లు, 33/11 కేవీ సబ్ స్టేషన్లు-156, 33 కేవీ ఫీడర్లు-266, 11 కేవీ ఫీడర్లు -988 జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. రెండో దశలో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో మ్యాపింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో కోటి మంది వినియోగదారుల విద్యుత్ సర్వీసులు, సంబంధిత డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లతో అనుసంధానం చేస్తున్నారు.
కనెక్షన్ల జారీ నుంచి బిల్లుల వసూళ్ల వరకు..
విద్యుత్ సరఫరా నుంచి అంతరాయాలు, మరమ్మతులు, బిల్లుల జారీ, వసూళ్లు ఇలా అన్ని విభాగాల పర్యవేక్షణ ఆన్‌లైన్ వేదికగా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. వినియోగదారులు కొత్త విద్యుత్ కనెక్షన్లకు ఏ తేదీన దరఖాస్తు చేసుకున్నారు, దరఖాస్తు ఏ అధికారి వద్ద ఎన్ని రోజులు ఉంది.. ఏ తేదీన కనెక్షన్ రిలీజ్ అయ్యిందనే వివరాలు ప్రతీ ఒక్కటి ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే ఏ సమయంలో ఫిర్యాదు అందించి, ఎన్ని నిమిషాల్లో సమస్య పరిష్కరించారనే రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్‌ను ఎలక్ర్టిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై కేంద్రానికి లేఖ
లాభం ఆశ చూపి.. రూ.16.35 లక్షలు కొట్టేశారు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News