Share News

150 పిజ్జాలు, 1000 బిస్కెట్ ప్యాకెట్లు.. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు నాగాలాండ్ యువకుడి అండ..

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:00 AM

నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు.

150 పిజ్జాలు, 1000 బిస్కెట్ ప్యాకెట్లు.. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు నాగాలాండ్ యువకుడి అండ..
Jantar Mantar protest

నీట్ పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. వేల మంది విద్యార్థులు ఆ నిరసనల్లో పాల్గొంటున్నారు. అక్కడకు వెళ్లలేకపోయిన వారు విద్యార్థులకు తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా నాగాలాండ్‌కు చెందిన ఓ యువకుడు ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్ధులకు వినూత్నంగా తన మద్దతు తెలిపాడు (Nagaland man help).


తాను స్వయంగా నిరసనలో పాల్గొనలేకపోయినా, ఆకలితో ఉన్న విద్యార్థుల కోసం 150 చీజ్ పిజ్జాలు, వెయ్యి బిస్కెట్ ప్యాకెట్లను పంపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @adiespoems పేరుతో ఉన్న యువకుడు జులై 22న డొమినోస్ ద్వారా 150 పిజ్జాలను ఆర్డర్ చేశాడు. పిజ్జాల ధర, పన్నులు, ప్యాకేజింగ్ తదితర ఖర్చులతో కలిపి మొత్తం బిల్లు రూ. 67,734.18 అయ్యింది. అనంతరం జులై 24న విద్యార్థుల కోసం మరో రూ.5,000 విలువైన బిస్కెట్లు కూడా పంపించాడు (Jantar Mantar protest).


ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తు కోసం పోరాడుతుండగా తాను నాగాలాండ్‌లో కూర్చోవడం బాధగా అనిపించిందని అతడు తెలిపాడు (Viral news). 'నేను అక్కడ ఉండలేకపోయాను. అందుకే నా వంతుగా ఇది చేశాను. నాకు ప్రశంసలు అక్కర్లేదు' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు. డెలివరీ బాయ్ ఫోన్ చేసి 'ఈ పిజ్జాలను ఎవరికి ఇవ్వాలి?' అని అడిగినప్పుడు, 'ఇంకా భోజనం చేయని ఎవరికైనా ఇవ్వండి' అని చెప్పానని అతడు వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..

Updated Date - Jul 25 , 2026 | 09:13 AM