Share News

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:24 AM

ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

చర్చల విషయంలో ఇరాన్ సానుకూలంగా ఉంది.. సీరియస్‌గా మట్లాడుతున్నారు: ట్రంప్
Donald Trump

ఇరాన్‌తో కొనసాగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు ఇప్పుడు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారని, అందుకే భారీ సైనిక దాడులు చేపట్టాలా లేదా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు (Donald Trump Iran talks).


'ఇరాన్ ముందున్న రెండు మార్గాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం, లేకపోతే మరింత తీవ్రమైన సైనిక చర్యలను ఎదుర్కోవడం. ప్రస్తుతం వారు చాలా సీరియస్‌గా చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు కొనసాగుతున్నందున దౌత్య పరిష్కారానికి అవకాశాన్ని పూర్తిగా మూసివేయలేదు' అని ట్రంప్ పేర్కొన్నారు (US Iran negotiations).


కాగా, శుక్రవారం ట్రంప్ తన భద్రతా సలహాదారులతో ఇరాన్‌పై విస్తృత స్థాయి సైనిక చర్యలపై చర్చించినట్లు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి (US military strikes). అయితే ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నందున ఇరాన్‌పై భారీ దాడుల గురించి ఆలోచించడం లేదని ట్రంప్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి..

Updated Date - Jul 25 , 2026 | 09:24 AM