Share News

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:24 AM

తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు.

రుయాలో ఆగిన థైరాయిడ్‌ పరీక్షలు

  • కిట్లు లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగులు

  • వారం లోగా తెప్పిస్తామన్న సూపరింటెండెంట్‌

తిరుపతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో థైరాయిడ్‌ పరీక్షలు నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన కిట్లు లేకపోవడంతో రోగులకు సేవలు అందడం లేదు. ఈ పరీక్షలు చేయడానికి సుమారు రూ.20 లక్షల విలువ చేసే మిషన్‌ అందుబాటులో ఉన్నా అవసరమైన కిట్లు అయిపోవడంతో పరీక్షలు నిలిపివేశారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి. రుయాకు థైరాయిడ్‌ పరీక్షలు చేసుకోవడానికి రోజుకు 40 నుంచి 50 మంది వస్తుంటారు. వీరిలో గర్భిణులు అధిక సంఖ్యలో ఉంటారు.


nani2.jpgఇక్కడ కిట్లు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. రుయాలో పరీక్షలు ఉచితంగా చేసే వారు. ప్రైవేటు ల్యాబుల్లో రూ.800 వసూలు చేస్తున్నారు. వారంలోగా అవసరమైన థైరాయిడ్‌ కిట్లు తెప్పించడానికి చర్యలు తీసుకుంటామని రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మనోహర్‌ తెలిపారు. ఇప్పటికే కిట్లు తెప్పించడానికి ఇండెంట్‌ పెట్టామన్నారు.


nani2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 11:24 AM