Share News

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:17 AM

లెబెనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..
gold price today India

ఇరాన్, అమెరికాల మధ్య రెండు వారాల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినా లాభం లేకుండా పోయింది. ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లోని చమురు రిఫైనరీతో పాటు పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. లెబెనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.


హైదరాబాద్ మార్కెట్‌‌లో బంగారం ధరలు ఇలా..

గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,53,820 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,41,000 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,15,370 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు ధరలు భారీగా తగ్గాయి. ఉదయం పది గంటల ప్రాంతంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,51,480.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,38,850.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం రూ. 1,13,610లుగా ఉంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,51,480

  • విజయవాడ: రూ.1,51,480

  • విశాఖపట్నం: రూ.1,51,480

  • ముంబై: రూ.1,51,480

  • బెంగళూరు: రూ.1,51,480

  • ఢిల్లీ: రూ.1,51,630

  • చెన్నై: రూ.1,52,730

  • సూరత్: రూ.1,51,530

  • మధురై: రూ.1,52,730

  • కోయంబత్తూరు: రూ.1,52,730


ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 09 , 2026 | 10:38 AM