భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసి.. ఆపై దారుణంగా
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:33 AM
సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్తపై కోపంపై భార్యను చిత్రహింసలకు గురిచేశారు గ్రామస్థులు.
సంగారెడ్డి, ఏప్రిల్ 9: భర్తపై కోపంతో ఏ పాపం తెలియని భార్యపై గ్రామస్థులు ప్రవర్తించిన తీరు సంచలనం సృష్టించింది. భర్త ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదంటూ భార్యను చిత్రహింసలకు గురిచేశారు గ్రామస్థులు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. అంగన్ వాడీ టీచర్ వసంత కుమారిని గ్రామస్థులు ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి విచాక్షణారహితంగా దాడి చేశారు.
అంగన్ వాడీ టీచర్ భర్త.. గ్రామంలోని కొంతమంది నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు వసూలు చేశాడు. వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తపై కోపంతో భార్యను గ్రామంలోని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామంటూ మహిళను బెదిరించారు. వద్దని బాధితురాలు ప్రాధేయపడినప్పటికీ గ్రామస్థులు కనికరించని పరిస్థితి. దాదాపు గంటకుపైగా అంగన్ వాడీ టీచర్‌ను చిత్రహింసలకు గురిచేశారు. భర్తపై ఉన్న కోపంతో సంబంధం లేని మహిళపై అరాచకంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News