Share News

ఆరోగ్యానిచ్చే గేగులు..

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:14 AM

ఆరోగ్యానికి మేలు చేసే గేగులు మార్కెట్‌లోకి వచ్చాయి. సీజనల్‌ ఉపాధిగా అందరికి అందుబాటు ధరలో ఉండే గేగులను రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లోకి తెచ్చి విక్రయిస్తు న్నారు.

ఆరోగ్యానిచ్చే గేగులు..
Rajanna Sircilla, Market

  • సిరిసిల్ల మార్కెట్‌లో జోరుగా విక్రయం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఆరోగ్యానికి మేలు చేసే గేగులు మార్కెట్‌లోకి వచ్చాయి. సీజనల్‌ ఉపాధిగా అందరికి అందుబాటు ధరలో ఉండే గేగులను రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లోకి తెచ్చి విక్రయిస్తు న్నారు. చక్కని రుచితో ఎక్కువ పోషకాలు కలిగిన గేగులను ప్రజలు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.


srl1.jpg

  • ఇలా తయారవుతాయి...

తాటిచెట్లకు ముంజల గెలలు ఉంటాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోసి అందులోని ముంజలను తింటారు. కాయలు ముదిరాక పం డ్లుగా మారి రాలుతాయి. కొందరు రైతులు ఏరి తమ పొలాల ఒడ్డున నీరుపారే ప్రాంతంలో పాతి పెడతారు. అవి మొలకెత్తి పెరుగుతున్న క్రమంలో వాటిని తవ్వితీసి ఆకులు కత్తిరించి కాండాన్ని కుండలో ఉడకబెట్టడం, దోరగా అయ్యేలాగా కాలుస్తారు. వాటి పైపొరను తొలగించడంతో చక్కగా తినడానికి వీలుగా గేగులు తయారవుతాయి.


  • ఎన్నెన్నో పోషకాలు

గేగులు అరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు తక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. చర్మ వ్యాధులు రాకుండా కాలేయం పెరగకుం డా, మలబ ద్ధక నివారణకు తోడ్పడుతుంది. రుచిగా ఉండే వంద గ్రాముల గేగులో 1.04 ప్రోటీన్‌లు, 0.19 శాతం ఫ్యాట్‌, 76.86 శాతం సుక్రోజ్‌, 1.66 శాతం గ్లూకోజ్‌, 3.15 శాతం మినరల్స్‌, 0.86 శాతం కాల్షియం, 0.05 శాతం పాస్పరస్‌, 11.01 ఎంజీ ఐరన్‌, 0.7 ఎంజీ కాపర్‌ లతో పాటు విటమిన్‌ బీ కూడా ఉంటుంది. నాలుగు, ఐదు గేగుల కట్టకు రూ.15-20 వరకు విక్రయిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ మృతి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 11:14 AM