Share News

ప్రధాని మోదీ అలా చేయరని అనుకుంటున్నా: సామ్ పిట్రోడా

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:29 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లను ట్యాప్ చేసే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ అలా చేయరని అనుకుంటున్నా: సామ్ పిట్రోడా
Sam Pitroda about Rahul Gandhi Phone Tapping

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లను ట్యాప్ చేసే వ్యక్తి కాదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ చేసిన విమర్శల నేపథ్యంలో పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తన ఫోన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాప్ చేయిస్తున్నారని ఇటీవల రాహుల్ గాంధీ ఆరోపించారు (Sam Pitroda about Phone Tapping).


తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్లను ట్యాప్ చేసే వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. అయితే తన ఫోన్ కూడా ట్యాప్ అవుతోందని, ల్యాప్‌టాప్‌పై దాడులు జరుగుతున్నాయని మరో సంచలన విషయం వెల్లడించారు. తన బ్యాంకు ఖాతాలపై నిఘా ఉందని పేర్కొన్నారు. తన పరికరాలను సైబర్ భద్రతా నిపుణులు పరిశీలించిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌పై హెచ్చరించారని వెల్లడించారు (Rahul Gandhi Phone Tapping).


తన ఫోన్‌ను ఎవరు ట్యాప్ చేస్తున్నారో తనకు తెలియదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందడం లేదని చెప్పారు (PM Modi Phone Tapping). ఈ వ్యవహారంలో ప్రధాని మోదీని నేరుగా నిందించలేమని పిట్రోడా వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని మోదీ గురించి పిట్రోడా సానుకూలంగా మాట్లాడడం కొత్త చర్చకు దారి తీసింది. మోదీతో తనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు వేరైనా పరస్పరం గౌరవించుకుంటామని పిట్రోడా గతంలోనే చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు మోదీపై ఆరోపణలను ఆయన నమ్మడం లేదని చెబుతూనే, మరోవైపు తన పరికరాలపై నిఘా ఉందని ఆరోపించడం ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..


పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 14 , 2026 | 10:29 AM