Share News

బోలుతో గుల్ల..ప్రమాదకరంగా ఆస్టియో పోరోసిస్‌ వ్యాధి

ABN , Publish Date - Oct 20 , 2026 | 09:31 AM

ఆస్టియో పోరోసిస్‌.. ఇది ఎముకలను బోలుగా మార్చే వ్యాధి. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు.

బోలుతో గుల్ల..ప్రమాదకరంగా ఆస్టియో పోరోసిస్‌ వ్యాధి
health

  • అప్రమత్తత అవసరం

  • లేకపోతే మంచానికే పరిమితం

  • మహిళల్లో బాధితులు అధికం

  • జిల్లాలో 2.30 లక్షల మంది వ్యాధిగ్రస్థులు

  • నేడు ప్రపంచ బోలు ఎముకల నివారణ దినం

నెల్లూరు: ఆస్టియో పోరోసిస్‌.. ఇది ఎముకలను బోలుగా మార్చే వ్యాధి. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. మానవ శరీర నిర్మాణంలో ఎముకల వ్యవస్థ ప్రత్యేక అమరికలాగా ఉంటుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలో శక్తి క్షీణించడమే కాకుండా ఎముకల పటుత్వం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీని వల్ల అనేక స మస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా వృద్ధులకు వచ్చే ఈ వ్యాధి ప్రస్తుతం యువకుల్లోనూ కనిపిస్తోంది.


ప్రత్యేకించి మహిళలలో ఆ వ్యాధి గ్రస్తు లు ఎక్కువగా ఉండటం గమనార్హం. శరీరంలోని ఎముకలు పెళుసుగా మారి ప్రమాదానికి లోనవుతున్నారు. దీనివల్ల ఒక్కసారిగా దీర్ఘకాలిక వ్యాదులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఈస్ట్రోజన్‌ శాతం తగ్గి ఎముకల్లో కాల్షియం క్షీణించి ఆస్టి యో పోరోసిస్‌ వ్యాధికి గురవుతున్నారు. ఒక్కో సారి ఈ వ్యాధి మరణాలకు కూడా దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


  • జిల్లాలో 2.30 లక్షల మంది వ్యాధిగ్రస్థులు జిల్లావ్యాప్తంగా వృద్ధులు 5 లక్షల మందికిపైగా ఉండగా వారిలో 1.50 లక్షల మంది బోలు ఎముకుల వ్యాధికి గురైన ట్లు గణాంకాలు చెబుతున్నా యి. మరో 80వేల మంది మహిళలు, యువకులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వింజమూరు, కలి గిరి, రాపూరు తదితర మండ లాల్లో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సైతం ఆధునిక పనిముట్లు అంద బాటులోకి రావటంతో శారీరక శ్రమ తగ్గింది. బలవర్థకమైన ఆహా రం తీసుకునే పరిస్థితి లేదు. దీనికి తోడు అవగాహన లేమితో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ వ్యాధిపై ముంద స్తు జాగ్రత్తలు లేకపోవడంతో కొందరు మంచానికే పరిమితం అవుతున్నారు.


heal.jpg

  • మహిళలూ.. జాగత్త్ర

ఆస్టియో పోరోసిస్‌ వ్యాధి ప్రభావం మహిళ ల్లో ఎక్కువగా ఉంది. 45 సంవత్సరాల వయసు పైబడిన మహిళలు ఈ వ్యాధికి గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్‌ డీ లోపం, కాల్షియం తక్కువగా తీసుకోవడం, రుతుస్రావం తొందరగా ఆగిపోవడం, జన్ముపరమైన కారణాలు, ఎముకల ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. థైరాయిడ్‌ బాధితుల్లో ఆ ప్రభావం ఎముకల సాంద్రతపై పడుతోంది. సూర్యకాంతిలో గడిపే సమ యం తక్కువగా ఉండటం, కాలుష్యం పెరిగిపో వడం, పోషకాహారం తీసుకోకపోవడం దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.


ఇలా చేస్తే మంచిది..

  • జీవనశైలిలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి.

  • మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

  • దృఢమైన ఎముకలు, పగుళ్ల నివారణ కోసం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో విటమిన్‌ డీ కూడా ఉండాలి.


  • తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, పెరుగు, వెన్న, పచ్చని ఆకుకూరలు, చేపలు, బాదంపప్పు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

  • తృణ ధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.

  • ఎత్తుగా ఉండే బూట్లు, చెప్పులు వాడటం తగ్గించాలి.

  • ఎముకల సాంద్రత తగ్గిపోవడాన్ని నివారించే మందులు అందుబాటులో ఉన్నాయి.

  • ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ చికిత్సలు కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 20 , 2026 | 09:31 AM