Share News

బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం

ABN , Publish Date - Oct 20 , 2026 | 06:28 AM

తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది.

బ్రహ్మాండ నాయకునికి   వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం
MALAYAPPASWAMY

  • అశ్వవాహనంపై కల్కిరూపంలో మలయప్ప దర్శనం

  • నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో శాస్త్రోక్త కార్యక్రమాలు ముగిసిన తరువాత శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగింపుగా వచ్చి స్వర్ణరథంపై ఆశీనులయ్యారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సువర్ణతేరు ఉత్సవం 9గంటలకు ముగిసింది. అనంతరం ఆలయానికి వేంచేసిన ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా కొలువు, ఆస్థానం, విశేష సమర్పణ కావించారు. రాత్రి కల్కిరూపాన్ని ధరించి అశ్వవాహనంపై మలయప్పస్వామి ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానాన్ని మంగళవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: సత్యకుమార్‌

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

Updated Date - Oct 20 , 2026 | 06:33 AM