ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: సత్యకుమార్
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:15 AM
వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్‌యాదవ్ తరఫున మంత్రి సోమవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌లకు అధ్యక్షుడు జగనేనని చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు, గవర్నర్‌కు ఫిర్యాదులు చేసి బయటకు వచ్చి వారినే విమర్శించడం జగన్ నైజమని మండిపడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వంటి వారిని అంతమొందించేందుకు పంజాబ్ నుంచి కిరాయి ముఠాలను తెప్పించారని, ప్రశాంత సీమలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలను రెచ్చగొట్టాలని చూస్తు న్నారని విరుచుకుపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు