Share News

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

ABN , Publish Date - Oct 20 , 2026 | 02:02 AM

అఖిల భారత డీజీపీల సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు ఏర్పేడు సమీపంలోని ఐసర్‌లో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ తదితర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల డీజీపీలు, 400 మంది ఐపీఎస్‌ అధికారులు హాజరుకానున్నారు.

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

వసతి, రవాణా, భద్రతపై అధికారులతో సమీక్ష

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అఖిల భారత డీజీపీల సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై కేంద్ర నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. డిసెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు ఏర్పేడు సమీపంలోని ఐసర్‌లో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ తదితర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల డీజీపీలు, 400 మంది ఐపీఎస్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో వసతి, రవాణా, భద్రతా ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించి ఏర్పాట్లను సమీక్షించినట్లు తెలిసింది. సదస్సు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టడంపై అధికారులు దృష్టి సారించారు.

Updated Date - Oct 20 , 2026 | 02:02 AM