Share News

మేయర్‌ పీఠానికి తప్పని పోటీ

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:49 AM

తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌ స్థానానికి పోటీ అనివార్యమైంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఎన్నికల అధికారులు వివిధ కారణాలతో 12 తిరస్కరించారు. దీంతో మిగిలిన అభ్యర్థులు, వారి రాజకీయ బలాబలాలు, పోటీకి సంబంధించిన పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

మేయర్‌ పీఠానికి తప్పని పోటీ

24 నామినేషన్లు దాఖలు... 12 తిరస్కరణ

తిరుపతి సెంట్రల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌ స్థానానికి పోటీ అనివార్యమైంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఎన్నికల అధికారులు వివిధ కారణాలతో 12 తిరస్కరించారు. దీంతో మిగిలిన అభ్యర్థులు, వారి రాజకీయ బలాబలాలు, పోటీకి సంబంధించిన పరిణామాలపై ఆసక్తి నెలకొంది. సోమవారం సాయంత్రం నామినేషన్ల పరిశీలన అనంతరం విడుదల చేసిన ప్రకటన మేరకు...టీడీపీకి సంబంధించి..3, వైసీపీ-1, బీఎస్పీ-1, సీపీఐ-1, సీపీఎం-1, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1, ఇతరులు-2, ఇండిపెండెంట్లు-2 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు వెల్లడించారు.బీజేపీ, ఎన్‌సీపీ, జనసేన అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు చెప్పారు. ఉపసంహరణ గడువు అనంతరం తుది అభ్యర్థుల వివరాలు నిర్ధారణ అయిన తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.

Updated Date - Oct 20 , 2026 | 01:49 AM