Share News

తిరుపతిలో వైసీపీ క్యాంపు రాజకీయం..

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:19 AM

తిరుపతిలో వైసీపీ అనూహ్యంగా క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపింది. నామినేషన్లు వేసిన దాదాపు 45 మందిని విత్‌ డ్రాయల్స్‌ వరకు కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు పన్నినట్టు తెలిసింది.

తిరుపతిలో వైసీపీ క్యాంపు రాజకీయం..
Municipal Elections

తిరుపతి: తిరుపతిలో వైసీపీ అనూహ్యంగా క్యాంప్‌ రాజకీయాలకు తెరలేపింది. నామినేషన్లు వేసిన దాదాపు 45 మందిని విత్‌ డ్రాయల్స్‌ వరకు కాపాడుకునేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు పన్నినట్టు తెలిసింది. విత్‌ డ్రాయల్స్‌కు ఇంకా రెండు రోజులు గడువుండడంతో ప్రలోభాలు, ఒత్తిళ్లతో ఎక్కడ రాజీపడిపోతారన్న అనుమానం కలిగి అభ్యర్థులను క్యాంపునకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది.


జాబితాలో సీపీఎం జీరో

48, 49 వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేసిన సీపీఎం నేతలు స్ర్కూట్నీ అనంతరం ప్రకటించిన జాబితాలో పేర్లు లేకపోవడంతో ఖంగుతిన్నారు. సీపీఎం తరపున 48వ వార్డుకు శ్రీనివాసులు, 49కి లక్ష్మి నామినేషన్లు దాఖలు చేయగా, స్ర్కూట్నీలో వాటిని ఎన్నికల అధికారులు ఆమోదించినట్టు తెలిసింది. అయితే విడుదల చేసిన జాబితాలో సీపీఎం నుంచి జీరో అని చూపడంపై ఆ పార్టీ నేతలు ఖండించడంతో జాబితాను పునఃసమీక్షించే పనిలో అధికారులున్నట్టు సమాచారం.


నామినేషన్లలో తప్పులు

నామినేషన్ల దరఖాస్తులో తప్పులు దొర్లడంతో ముగ్గురు వైసీపీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం జరిగిన నామినేషన్ల స్ర్కూట్నీలో 46, 13, 25 డివిజన్ల వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు సమాచారం. పుట్టిన తేదీ, ఓటరు జాబితాలో ఉన్నట్టు దరఖాస్తులో లేకపోవడం వంటి కారణాలతో పోటీకి దూరమయ్యారు. దీంతో ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు మునిశేఖర్‌ రాయల్‌ భార్య విజయ, కొట్టే హేమంత్‌ రాయల్‌ తల్లి రుక్మిణమ్మ, పూజారి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 20 , 2026 | 08:19 AM