Share News

ఉచితం ముసుగులో ఇసుకదందా

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:43 AM

బి.కొత్తకోట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఇసుకదందా భారీగా సాగుతోంది.

ఉచితం ముసుగులో ఇసుకదందా
Sand Transportation

బి.కొత్తకోట(తిరుపతి): బి.కొత్తకోట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా ఇసుకదందా భారీగా సాగుతోంది. గత ప్రభుత్వ తరహాలో ఇసుకదందాలు, ఆక్రమ రవాణా జరగకుండా ప్రజలకు ఉచితంగా ఇసుక అందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ బి.కొత్తకోట మండలంలో అమలు కావడం లేదని జనం వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయినా, బి.కొత్తకోట అర్బన్‌ లోనైనా రూ.3000 - 3500పెట్టి ఇసుకను కొనాల్సిందేనని అంటున్నారు. ముఖ్యంగా బి.కొత్తకోట పట్టణంలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉందంటున్నారు.


sand1.2.jpgపట్టణంలోని నలుగురైదుగురు రింగ్‌గా ఏర్పడి పట్టణ పరిసరాల నుంచి ఇసుకను ట్రాక్టర్‌ల ద్వారా తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటు న్నట్లు చెబుతున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవిన్యూ, మైన్స్‌, పోలీస్‌ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో దందా దర్జాగా నడుస్తోంది. పీటీఎం మండల సరిహద్దు గ్రామాలలో వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కి ఇసుకమేటలు ఉన్న భూమిని కొందరు లీజుకు తీసుకుని ఇసుకను తోడి అమ్ముకుని రూ.లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రహ్మాండ నాయకునికి వైభవోపేతంగా స్వర్ణరథోత్సవం

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 20 , 2026 | 08:43 AM