Share News

నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌

ABN , Publish Date - May 20 , 2026 | 07:22 AM

ఆన్‌లైన్‌ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్‌ దుకాణాల బంద్‌ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్‌ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్‌ దుకాణాలు మూతపడనున్నాయి.

నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌
Medical Shops

  • కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని దుకాణాల్లో సరఫరా

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్‌ దుకాణాల బంద్‌ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్‌ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్‌ దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని ప్రభుత్వ, కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మెడికల్‌ దుకాణాలు యధావిధిగా పనిచేయనున్నాయి. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, నిమ్స్‌లో మెడికల్‌ దుకాణాలు తెరిచి ఉంటాయని ఆయా ఆస్పత్రుల నిర్వాహకులు, మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు వెల్లడించారు.


city1.jpgఅర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో ఫార్మసీలు తెరిచే ఉంటాయని వైద్యాధికారులు తెలిపారు. కాగా, ది హైదరాబాద్‌ డిస్ట్రిక్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ బంద్‌ పాటించాలని మెడికల్‌ దుకాణాల నిర్వాహకులకు పిలుపుచ్చింది. ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ఎక్కువ శాతం డిస్కౌంట్‌ ఇవ్వడం, ప్రిస్కిషన్‌ లేకుండానే మందులను సరఫరా చేస్తున్నారని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాఘం సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 07:22 AM