భారీ కొండచిలువ పట్టివేత
ABN , First Publish Date - 2023-03-06T00:06:20+05:30 IST
తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భారీ కొండచిలువ పట్టుబడింది.
తిరుమల, మార్చి5(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ భారీ కొండచిలువ పట్టుబడింది. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌కు సమీపంలోని నీటిశుద్ధి కేంద్రం వద్ద ఈ పాము ను గుర్తించిన స్థానికులు పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం పాము దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు.