నిత్యం సైక్లింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు మెండు...
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:53 PM
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానం. అలాంటి వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పర్యావరణానికి తోడ్పాటు..
జైపూర్(మంచిర్యాల): ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానం. అలాంటి వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూడు పదులు నిండక ముందే కీళ్ల నొప్పులు, కాసింత నడుస్తారో లేదో ఆయాసం, మూడ డుగులు వేయక ముందే మోకాళ్ల నొప్పులు ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగి పోతుంది. ఇందుకు ప్రధాన కారణం గా ఒంటికి సరైన వ్యాయామం లేక పోవడమే కాకుండా చీటికి మాటికి వాహనాలను వినియోగించడం, కూర గాయలను కొనాలన్నా, పాల ప్యాకెట్ తేవాలన్నా అఖరికి ప్లే గ్రౌండ్‌కు వెళ్లాలన్నా బైక్‌తో వెళ్లాల్సిందే.
వ్యాయామానికి ఉపకరించే ఎలాంటి ఖర్చులేని పేదోడి వాహనం సైకిళ్లను తొక్కే వారి సంఖ్య ఏటే టా తగ్గిపోతుంది. వాహనాలను విని యోగించే వారి సంఖ్య మాత్రం పెరిగిపోతూ వాతావరణం కాలష్యమవుతుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైకిల్‌ను వాడితే ఆరోగ్యం ఖర్చు లేకుండా పొదుపుతో పాటు పర్యావరణ హితులుగా నిలిచే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యానికి మేలు...
సైకిల్ తొక్కడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు సైకిల్ వినియోగంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నాయి. సైకిల్ తొక్కడంతో గంటకు సుమారు 300 కేలరీల శక్తి ఖర్చవుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు పేరు కోకుండా ఉపయోగపడుతుంది. స్థూలకాయులకు ఇది మంచి వ్యాయామంగా పనిచేస్తుంది.
ప్రతి వందలో పది నుంచి 15 మంది వరకు ఊబకాయంతో బాధపడుతున్నారు అయితే వీరంతా చీటికి మాటికి మోటారు వాహనాలను వినియోగిస్తున్న వారే కావడం గమనార్హం. ఇలాం టి వారు సైకిల్ తొక్కడం వల్ల కొవ్వు తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. నిత్యం సైకిళ్ల సవారీ చేయడంతో పాటు గుండె, ఊపిరి తిత్తులు, నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మామూలు వాటి కంటే సైకిల్ తొక్కేవారు చురుగ్గా కనిపిస్తుంటారు. ప్రతి రోజు ఉద యం కొద్దిసేపు సైక్లింగ్ చేయడం వల్ల హృదయ సంబంధిత సమ స్యలు దూరమవుతాయని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనారోగ్య సమస్యలకు చెక్
సైకిల్ ఎలాంటి ఇంధన ఖర్చు అవసరం లేని వాహనం. కాలంతో పాటు పరిగెడుతున్న ఈనాటి పరిస్థితుల్లో మోటారు వాహనాల వినియోగం పెరుగుపోతుంది. ద్వి చక్రవాహ నాల వినియోగంతో పనులు సులువుగా అయి పోవడమే కాకుండా ఎలాంటి శ్రమ లేకుండా పని పూర్తి చేయచ్చనే భావన నేటి తరంలో అధికమైంది. రెండు దశాబ్దాల క్రితం ఆరోగ్య ప్రదాయినిగా నిలిచిన సైకిల్‌ను ఇప్పుడు చాలా మంది చులకనగా చూస్తున్నారు. సైకిల్ వినియోగిం చేవారి సంఖ్య తగ్గిపోతుంది. సైకిల్ వాడకంతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. మధుమేహం వ్యాధి గ్రస్థులు సైకిల్ తొక్కడం వల్ల షుగర్ అదుపులో ఉం టుంది. దీంతో ఖరీదైన పెట్రోలు వాడకం తగ్గించు కునే పొదుపు మంత్రంతో విదేశీ మారక ద్రవ్యాన్ని సైతం మిగిల్చిన వారమవుతాం.
పలు రకాల ప్రయోజనాలు
సైకిల్ వినియోగంతో పలు రకాల ప్రయోజనాలు చే కూరుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. మోటారు వాహనాల వినియోగం తగ్గించడంతో పాటు ఇంధన వినియోగాన్ని అదుపులో పెట్టు కోవచ్చు. ఏ వాహనంలో కూడా వందశాతం ఇంధనాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఉండవు. సరాసరి రెండోవంతు గాలిలో కలిసి పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుంది. దీంతో వాహనాల నుంచి వెలువడే పొగతో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పరిస్థి తుల్లో సైకిల్‌ను వినియోగిస్తే ఎలాంటి సమస్యలు ఉండకపోవడమే కాకుండా ఆర్ధిక భారాన్ని నియంత్రించే వీలుంటుంది. అనేక దేశాల్లో సైకిల్ వినియో గం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ కొంత మంది పర్యావరణ హితులు వేల కిలోమీటర్ల దూ రం సైకిల్ యాత్ర చేపడుతూ అవగాహన కల్పిస్తుండడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News