విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:53 PM
టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు.
మంత్రి పెరియస్వామి
చెన్నై: టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని మంత్రి ఐ.పెరియస్వామి స్పష్టం చేశారు. దిండుగల్ జిల్లా ఆత్తూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం మంత్రి పెరియస్వామి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డీఎంకే ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ సీఎం స్టాలిన్ చేసిన హామీలు తప్పకుండా నెరవేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 1.32 కోట్ల మందికి అందించే సాధికారి క నగదును ఎన్నికల పేరుతో అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. బీజేపీ ఎత్తుగడ పసిగట్టిన ముఖ్యమంత్రి, లబ్దిదారులకు మూడు నెలల నగదు, వేసవి ఖర్చులకు రూ.2 వేలు మొత్తం రూ.5 వేలు జమచేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ద్రావిడ మోడల్ 2.0 పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:
దేశంలో డిజిటల్ జనగణన ప్రారంభం
యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!
Read Latest Telangana News and National News