Share News

యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!

ABN , Publish Date - Apr 02 , 2026 | 06:56 AM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రజల మీద పడకుండా అన్ని స్థాయిల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని, మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు...

యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!

  • నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు

  • సీసీఎస్‌ భేటీలో ప్రధాని మోదీ ఆదేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రజల మీద పడకుండా అన్ని స్థాయిల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని, మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు. మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ‘భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ’ (సీసీఎస్‌).. యుద్ధం నేపథ్యంలో కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. ఇంధనం, వ్యవసాయం, పౌర విమానయా నం, సరఫరాలు తదితర రంగాల్లో తదుపరి చేపట్టాల్సిన పనులపై చర్చించింది. ఎటువంటి అవాంతరా లు లేకుండా ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరా ప్రక్రియ కొనసాగేలా చూడటం, వాటి దిగుమతులకు కొన్ని దేశాల మీదే ఆధారపడకుండా.. పలు దేశాల నుంచి దిగుమతి చేసుకోవటంపై క్యాబినెట్‌ కార్యదర్శి ఈ సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ప్రధాని నిర్దేశించారు. తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి కాకుండా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలన్నారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా కట్టుదిట్టమైన చ ర్యలు తీసుకోవాలని, బ్లాక్‌మార్కెటింగ్‌పై ఉక్కుపా దం మోపాలని పునరుద్ఘాటించారు. ఈ మేరకు కఠి న చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు. దిగుమతులకు ఇబ్బంది తలెత్తకుండా హొర్ముజ్‌ జలసంధి గుండా భారత నౌకలు సురక్షితంగా వచ్చేలా చూడటంపై సమీక్ష జరిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 06:56 AM