కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:02 PM
కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, గుడిలో ప్రమాణం చేస్తామనని కాంగ్రెస్ నేత తెలిపారు.
సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 1: ఆర్‌సీ పురంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్(Kata Srinivas Goud) ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని.. తడి బట్టలతో గుడిలో ప్రమాణం చేస్తానని కాంగ్రెస్ నేత తెలిపారు. అందులో భాగంగా ఈరోజు(గురువారం) ఉదయం బీరంగూడ శివాలయం వద్ద ప్రమాణం చేయడానికి వాహనంలో బయలుదేరారు కాటా శ్రీనివాస్.
ఇంటి బయటే పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శివాలయం వద్దకు వెళ్లే తీరుతానని కాటా శ్రీనివాస్ పట్టుబట్టారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తన కుటుంబ సభ్యులను గుడికి అనుమతించాలని పోలీసులను శ్రీనివాస్ కోరారు. చివరకు కాటా శ్రీనివాస్ గౌడ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ వైపు తరలించారు.
ఇదీ విషయం...
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ అవినీతి ఆరోపణలు, కాటా శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేయడంతో వార్ మొదలైంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమైతే శివాలయంలో తడి బట్టలతో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని, గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని కాటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ సవాల్‌పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
Read Latest Telangana News And Telugu News