బడంగ్పేట్ అవినీతి కేసు.. 10 మంది అధికారులపై వేటు
ABN , Publish Date - Apr 02 , 2026 | 10:34 AM
బడంగ్పేట్ అవనీతి కేసులో అధికారులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 2: జీహెచ్‌ఎంసీ బడంగ్పేట్ అవనీతి కేసులో పది మంది అధికారులపై వేటు పడింది. జీహెచ్‌ఎంసీ బడంగ్పేట్ సర్కిల్‌లో ఇంజనీరింగ్, సానిటేషన్, ఈవెంట్ పనులలో పెద్దుఎత్తున అవినీతి జరిగినట్లు జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం, ఏసీబీ విచారణలో తేలింది. అధికారులు కోట్లాది రూపాయలకు సంబంధించిన పనులను చేయకుండానే బిల్లులు నొక్కి, నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 10 మంది అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
సస్పెండ్ అయిన అధికారులు వీరే...
పి. సరస్వతి - డిప్యూటీ కమిషనర్
జి. శ్రీధర్ రెడ్డి - ఏఎంసీ
జి. రఘు - మున్సిపల్ కమిషనర్
ఎ. యాదయ్య - డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్
వెంకన్న - డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్
జ్యోతి - డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్
ఎన్. వెంకట్ - ప్రీ ఆడిట్ ఆఫీసర్
పి. వినీల్ కుమార్ గౌడ్ - అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్
వై. యాదగిరి - శానిటరీ ఇన్‌స్పెక్టర్
డి. నాగేశ్వర్ రావు - ఏఎంసీ
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News