Share News

ఊటీ గార్డెన్‌లో సినిమా షూటింగ్‌ల నిషేధం

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:11 PM

ఊటీలో సినిమా షూటింగ్‌లపై నిషేధం విధించారు. పర్వతరాణిగా పేరుగాంచిన నీలగిరి జిల్లా ఊటీలో తేయాకు తోటలు, ఇతర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఊటీ గార్డెన్‌లో సినిమా షూటింగ్‌ల నిషేధం

చెన్నై: ఊటీలో సినిమా షూటింగ్‌లపై నిషేధం విధించారు. పర్వతరాణిగా పేరుగాంచిన నీలగిరి జిల్లా ఊటీలో తేయాకు తోటలు, ఇతర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో, ఊటీలో తమిళం, మలయాళం, తెలుగు, హిందీ చిత్రాల షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌, మే నెలల్లో వేసవి సీజన్‌ సందర్భంగా పూలు, పండ్లు, ఉద్యానవన పంటలు తదితరాలతో కూడిన ప్రదర్శనలు ఏర్పాటుచేస్తుంటారు.


nani2.jpgఈ కారణంగా, బుధవారం నుంచి మూడు నెలలు బొటానికల్‌ గార్డన్‌, సిమ్స్‌ పార్క్‌ సహా 8 పార్క్‌ల్లో సినిమా షూటింగ్‌లపై ఉద్యానవన శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నవనీత నిషేధం విధించారు.


nani2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

దేశంలో డిజిటల్‌ జనగణన ప్రారంభం

యుద్ధం ప్రభావం ప్రజల మీద పడొద్దు!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 12:31 PM