నేడు హనుమాన్ జయంతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Apr 02 , 2026 | 07:06 AM
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నగరంలో విజయయాత్ర ర్యాలీ నిర్వహించనున్నారు.
మద్యం దుకాణాలు బంద్
బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నగరంలో విజయయాత్ర ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామాలయం నుంచి ప్రారంభమై రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్‌లోని హనుమాన్ ఆలయానికి విజయయాత్ర చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. గౌలిగూడ రామాలయం, పుత్లిబౌలి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, ప్రాగాటూల్స్., కవాడిగూడ, సీజీఓ టవర్స్, బస్సీలాల్‌పేట్, బైబిల్ హైస్, ఘాన్సీమండి, సిటీలైట్ హోటల్,
బాటా, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ క్రాస్‌రోడ్స్ పారంతంలో ట్రాఫిక్ మళ్లించనున్నట్లు జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. విజయయాత్ర సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌ల పరిఽఽధిలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాల్లో విక్రయాలపై నిషేధం విధించారు. మల్కాజిగిరి కమిషనరేట్‌లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
వాహనాల దారి మళ్లింపు ఇలా..
లక్డీకాపూల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్ వైపు.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలను ఎల్‌బీనగర్ మీదుగా మెహదీపట్నం వైపు పంపుతారు. కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి 14 ఉప యాత్రలు ప్రధాన ర్యాలీలో కలువనున్నాయి. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో యాత్ర రెండు కిలోమీటర్ల మేర మాత్రమే ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకు సీటీఓ జంక్షన్ చేరుకున్న తర్వాత తాడ్‌బండ్ వరకు ఆంక్షలు ప్రారంభమవుతాయి. ర్యాలీ జరుగుతున్న ప్రాంతాలను సీసీ టీవీల ద్వారా పోలీసు అధికారులు పరిశీలిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!
Read Latest Telangana News and National News