పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:36 AM
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 2న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో ఇటీవల భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం తిరిగి పుంజుకుంటున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది (Gold prices).
ఈ రోజు (ఏప్రిల్ 2న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,52,960 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,210 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,53,110కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,40,360కి చేరుకుంది.
మరోవైపు వెండి ధర కూడా క్రమంగా పుంజుకుంటోంది. ప్రస్తుతం 2.5 లక్షల రూపాయల మార్క్ ఎగువకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1,52,960, రూ.1,40,210
విజయవాడలో రూ.1,52,960, రూ.1,40,210
ఢిల్లీలో రూ.1,53,110, రూ.1,40,360
ముంబైలో రూ.1,52,960, రూ.1,40,210
వడోదరలో రూ.1,53,010, రూ.1,40,260
కోల్‌కతాలో రూ.1,52,960, రూ.1,40,210
చెన్నైలో రూ.1,53,280, రూ.1,40,510
బెంగళూరులో రూ.1,52,960, రూ.1,40,210
కేరళలో రూ.1,52,960, రూ.1,40,210
పుణెలో రూ.1,52,960, రూ.1,40,210
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ.2,65,100
విజయవాడలో రూ.2,65,100
ఢిల్లీలో రూ.2,55,100
చెన్నైలో రూ.2,65,100
కోల్‌కతాలో రూ.2,55,100
కేరళలో రూ.2,65,100
ముంబైలో రూ.2,55,100
బెంగళూరులో రూ.2,55,100
వడోదరలో రూ.2,55,100
అహ్మదాబాద్‌లో రూ.2,55,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్