అది మా యుద్ధం కాదు..
ABN , Publish Date - Apr 02 , 2026 | 06:31 AM
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి తాము దిగే ప్రసక్తే లేదని, అది తమ యుద్ధం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు...
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడి
లండన్, ఏప్రిల్ 1: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి తాము దిగే ప్రసక్తే లేదని, అది తమ యుద్ధం కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు వీలైన అన్ని దౌత్యమార్గాలను అనుసరిస్తామని చెప్పారు. ఎవరెంత ఒత్తిడి తెచ్చినా బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. యుద్ధంలో సాయం చేయని యూకే, ఇతర యూరప్ దేశాలకు తాము భవిష్యత్తులో ఎలాంటి సాయం చేయబోమన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కీర్ స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడి, ఇంధన ధరలు పెరిగాయని.. ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సిద్ధంగా ఉందని చెప్పారు. హోర్ముజ్ జలసంధిని తెరిచే అంశంపై 35 దేశాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కీర్ స్టార్మర్ తెలిపారు. తమ విదేశాంగ మంత్రి వెట్టే కూపర్ ఆధ్వర్యంలో లండన్‌లో సమావేశం జరుగుతుందని, 35 దేశాల ప్రతినిధులు హాజరై.. హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి, నౌకల భద్రతకు అవసరమైన దౌత్య, రాజకీయ అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. నాటో తమకు దశాబ్దాలుగా భద్రత కల్పిస్తోందని, తాము నాటోకు పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News