Share News

ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే మంచి జరుగుతుందా?

ABN , Publish Date - Apr 02 , 2026 | 10:57 AM

మరణం గురించి కలలు రావడం చాలా మందికి భయంగా అనిపిస్తుంది. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి ఎక్కువగా శుభ సూచకాలుగా భావిస్తారు.

ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే మంచి జరుగుతుందా?
Dream About Death Meaning

ఇంటర్నెట్ డెస్క్: మరణం గురించి కలలు రావడం చాలా మందికి భయంగా అనిపిస్తుంది. కానీ స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి చెడు సంకేతాలు కావు. చాలా సార్లు ఇవి మంచి సూచనలుగా కూడా భావిస్తారు. మరి ఇలాంటి కలలకు అర్థం ఏమిటి? జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..


మనకు మనమే చనిపోయినట్లుగా లేదా ఇతరులు మరణించినట్లుగా కల వస్తే, అది చెడు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కలలు అదృష్టాన్ని తెస్తాయి, ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, కష్టాలు తొలగిపోతాయి, ఆయుష్షు పెరుగుతుందని అంటారు.


కలలో ఇతరులు మరణించినట్లు కనిపిస్తే, వారి ఆయుర్దాయం పెరుగుతుందని చెబుతారు. మనమే చనిపోయినట్లు కల వస్తే, మన సమస్యలు తగ్గి కొత్త ప్రారంభానికి దారితీస్తుందని భావిస్తారు. అందువల్ల ఇలాంటి కలల వల్ల భయపడాల్సిన అవసరం లేదు. పురాణాల ప్రకారం కూడా ఇది శుభప్రదమే. కలలో మృత్యువును చూసినవారు దీర్ఘాయుష్షు పొందుతారు, ఆరోగ్యంగా మారుతారు, దుఃఖంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు.


ఇలాంటి కలలు వచ్చినప్పుడు, హనుమంతుడు లేదా శివుడిని దర్శించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శివాలయంలో పూజ చేసి విభూతి ధరించడం కూడా శ్రేయస్కరం అని చెబుతున్నారు. మరణం గురించి కలలు రావడం అంటే చెడు జరుగుతుందని కాదు. చాలా సందర్భాల్లో ఇవి మంచి మార్పులకు సంకేతంగా భావిస్తారు. కాబట్టి భయపడకుండా, సానుకూలంగా ఆలోచించడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 02 , 2026 | 11:13 AM