290 మందిని ముంచేసి..రూ.30 కోట్లు కొట్టేసి..
ABN , Publish Date - Apr 02 , 2026 | 08:09 AM
భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అధిక వడ్డీ ఆశ చూపి ఘరానా మోసం
ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: భారీ వడ్డీ పేరుతో సుమారు 290 మంది నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగోల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్‌కు చెందిన కిచ్చ వీరభద్రరావు(51), రాజ్యలక్ష్మి దంపతులు వెంకటదుర్గాప్రసాద్ అనే సహాయకుడితో కలిసి జీఎస్ఐ డివిజన్‌లోని కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, రోడ్ నంబర్ 13లో 2024 జూన్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ‘‘వీరభద్ర ట్రేడింగ్’’ పేరుతో కార్యాలయం ప్రారంభించారు.
ఈ సంస్థలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి నెలకు రూ.10 వేల చొప్పున చెల్లిస్తామని అధిక వడ్డీ ఆశ చూపారు. మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ రావడంతో నమ్మిన సుమారు 290 మంది రూ. 30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావుపై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
అప్పుల భారంతో రూ. 30 కోట్లలో రూ. 15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి, మిగతా రూ. 15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు నాగోల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు వీరభద్రరావు, రాజ్యలక్ష్మి, వెంకటదుర్గాప్రసాద్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!
Read Latest Telangana News and National News