నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:20 AM
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
హిందూపురం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (TDP MLA Nandamuri Balakrishna) ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా( Mega Job Mela) నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మునిసిపల్ కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీఐఈఎల్ టూరిజం ఆస్పిటారిజి సెక్టార్‌స్కిల్స్ సహకారంతో స్థానిక సప్తగిరి కళాశాలలో ఉదయం 9గంటల నుంచి జాబ్‌మేళా ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బీటెక్, పీజీ చదివి 18నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రమేష్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య, సురేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రహదారుల పక్కన ఉండే వృక్షాల కోసం ప్రత్యేక పాలసీ: పవన్ కల్యాణ్
ఆ రెండు బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం..
Read Latest Telangana News And AP News And Telugu News