Share News

జేఎన్‌టీయూలో ఎప్‌సెట్‌ ఆఫీస్‌

ABN , Publish Date - Nov 04 , 2026 | 08:25 AM

జేఎన్‌టీయూలోని ఎప్‌సెట్‌ ఆఫీ్‌సను మహిళా ఉద్యోగుల వెయిటింగ్‌ హాల్‌ కోసం కేటాయిస్తూ రిజిస్ట్రార్‌ జయలక్ష్మి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.

జేఎన్‌టీయూలో ఎప్‌సెట్‌ ఆఫీస్‌
JNTU Hyderabad

  • ఇకపై మహిళా ఉద్యోగులకు వెయిటింగ్‌ హాల్‌

  • ఉత్తర్వులు జారీచేసిన వర్సిటీ రిజిస్ట్రార్‌ జయలక్ష్మి

  • అదే భవనంలో ఖాళీ స్పేస్‌ ఉన్నా ఎప్‌సెట్‌ ఆఫీసును కేటాయించడంపై విమర్శలు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలోని ఎప్‌సెట్‌ ఆఫీ్‌సను మహిళా ఉద్యోగుల వెయిటింగ్‌ హాల్‌ కోసం కేటాయిస్తూ రిజిస్ట్రార్‌ జయలక్ష్మి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. మహిళా ఉద్యోగుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, గత నాలుగేళ్లుగా ఎప్‌సెట్‌ ఆఫీసు కొనసాగుతున్న భవనంలోనే.. వెనుకవైపు మరింత ఖాళీస్పేస్‌ ఉన్నప్పటికీ, ఎప్‌సెట్‌ ఆఫీసునే మహిళల వెయిటింగ్‌ హాల్‌ కోసం కేటాయించడం రెండ్రోజులుగా యూనివర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహిళా ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలకు, అనుకోకుండా ఎవరైనా అస్వస్థతకు గురైన పక్షంలో విశ్రాంతి తీసుకునేందుకు ఎప్‌సెట్‌ ఆఫీసు ప్రదేశం సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు


city4.2.jpgఅయితే, ఎప్‌సెట్‌ ర్యాంకులు పొందిన అభ్యర్థులకు ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో అగ్రికల్చర్‌, నర్సింగ్‌ కౌన్సెలింగ్‌.. కొనసాతున్నందున, పలువురు అభ్యర్థులు వారి ర్యాంకు కార్డులు, హాల్‌టికెట్లలో దొర్లిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఎప్‌సెట్‌ ఆఫీసుకి వస్తున్నారు. అకస్మాత్తుగా ఎప్‌సెట్‌ ఆఫీసును అక్కడ్నుంచి ఎత్తివేస్తే ఎంక్వయిరీ కోసం వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. మహిళల వెయిటింగ్‌ హాల్‌ కోసం ఎప్‌సెట్‌ ఆఫీసును ఉన్న పళంగా ఎత్తివేయడంపై పునరాలోచన చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు రిజిస్ట్రార్‌కు, వైస్‌చాన్స్‌లర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 08:25 AM