ఛాతివ్యాధుల ఆస్పత్రిలో మూతపడిన విభాగాలు
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:58 AM
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలోగల ఛాతివ్యాధుల ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తారు. ఛాతివ్యాధులకు, టీబీకి సంబంధించి ఇక్కడ చికిత్స పొందుతుంటారు.
శిథిలావస్థకు పలు భవనాలు
వార్డుల కొరత వల్ల రోగులకు అందని సేవలు
హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఛాతివ్యాధుల ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తారు. ఛాతివ్యాధులకు, టీబీకి సంబంధించి ఇక్కడ చికిత్స పొందుతుంటారు. రోజుకు వందలాది మంది ఓపీ చికిత్స పొందుతుండగా, కొంతమంది ఆస్పత్రిలో చేరుతుంటారు. ఆస్పత్రిలో చేరేవారికి సరైన వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏళ్ల కిందట నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఫిమేల్ వార్డు, మేల్ వార్డు, స్వైన్‌ఫ్లూ వార్డులను పూర్తిగా మూసివేశారు. ఉన్న వార్డుల్లో రోగులకు వైద్యం అందిస్తున్నారు.
కేర్ అండ్ సపోర్టు సెంటర్‌లోనే చికిత్స
ప్రస్తుతం నూతన భవనమైన కేర్ అండ్ సపోర్టు సెంటర్‌లోనే రోగులందరికీ చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోగుల సహాయకుల కోసం నిర్మించిన విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, వంటశాలలు కూడా మూతపడ్డాయి. దీంతో రోగుల సహాయకులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆస్పత్రి బయటకు వెళ్తున్నారు. చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ హోటళ్ల నుంచి భోజనాలు తెచ్చుకుంటున్నారు. ఆస్పత్రిలోని రోగుల వంటశాల పక్కన ఉన్న ఆస్పత్రి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయానికి తాళం వేశారు.
కొన్ని సంవత్సరాల నుంచి తెరవడం లేదు. కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ పక్కన ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ గదులు పూర్తిగా శిథిలమవడంతో వాటిని ఉపయోగించడం లేదు. ఆస్పత్రిలో ఎన్నో విభాగాలు మూతపడ్డా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూతపడ్డ విభాగాలు తెరిచేందుకు ప్రభుత్వం, ఆస్పత్రి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర
బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News