Share News

కాంగ్రెస్‌ తెచ్చిన కరువే: ప్రశాంత్‌రెడ్డి

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:54 AM

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చి పెట్టిన కరువని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్‌ తెచ్చిన కరువే: ప్రశాంత్‌రెడ్డి
Vemula Prashanth Reddy

భూపాలపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చి పెట్టిన కరువని మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లోని మేడిగడ్డ బ్యారేజీని బీఆర్‌ఎస్‌ ప్రతినిధి బృందం సందర్శించింది. ప్రశాంత్‌రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు బ్యారేజీ స్థితిగతులను, నీటి పారుదలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ చూసిన నీటిఎద్దడి కనిపిస్తున్నప్పటికీ, మేడిగడ్డ వద్ద నీళ్లు పుష్కలంగానే ఉన్నాయని అన్నారు. నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కుట్రతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ బ్యారేజీని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:54 AM