పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో గృహిణికి రూ. 3.70 లక్షల టోకరా!
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:01 AM
పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.2.70 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ సిటీ: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.2.70 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం వట్టినాగులపల్లికి చెందిన 22 ఏళ్ల గృహిణికి ఆగస్టు 14న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగ ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయడంతో మనీషా శర్మ అనే మహిళ వాట్సా్‌పలో సంప్రదించింది. గూగుల్ మ్యాప్స్‌లో రివ్యూలు ఇస్తే ఒక్కో టాస్క్‌కు రూ.180 చెల్లిస్తామని చెప్పింది.
అనంతరం టెలిగ్రామ్ గ్రూపులో చేర్చి, బిట్‌కాయిన్ ట్రేడింగ్ టాస్కులు అప్పగించింది. టెలిగ్రామ్‌లోని టీచర్, కస్టమర్ సపోర్టు పేర్లతో పలువురు బాధితురాలికి సూచనలు చేస్తూ విడతలవారీగా డబ్బులు కట్టించుకున్నారు. టాస్క్‌లో పొరపాటు జరిగిందంటూ రిపేర్ పేరుతో రూ.50 వేలు, మరోసారి రూ.80 వేలు వసూలు చేశారు. విత్‌డ్రా సమయంలో సాంకేతిక సమస్యలు, క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనే సాకులతో మరో రూ. 1.80 లక్షలు,
రూ.90వేలు చెల్లించేలా చేశారు. మొత్తంగా రూ.3,76,860 బదిలీ చేయగా, కేవలం రూ.6,670 మాత్రమే తిరిగి ఇచ్చారు. యాప్‌లో రూ.13.10 లక్షల లాభం వచ్చినట్లు చూపించి, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలంటే రూ.2,91,152 చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
వీబీజీరామ్‌జీ ఉపాధి పనుల్లో ముందంజ
Read Latest AP News And Telangana News And International News And Telugu News