సింగరేణిలో గైర్హాజరు కార్మికులకు తీపి కబురు
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:49 AM
సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగించిన(డిస్మిస్డ్) కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం విధివిధానాలను ప్రకటించింది.
తిరిగి ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్, కొత్తగూడెం టౌన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో గైర్హాజరు కారణంగా తొలగించిన(డిస్మిస్డ్) కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం విధివిధానాలను ప్రకటించింది. సంస్థలో 2023 నుంచి 2025 కాలంలో గైర్హాజరు కారణంగా విధుల నుంచి తొలగింపునకు గురైన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకునేందుకు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వారి వయస్సు 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలని పేర్కొంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఈ విషయమై వినతులు రావడంతో ప్రభు త్వం స్పందించి యాజమాన్యానికి ఆ కార్మికుల సమస్యను వివరించింది. దీంతో 2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబరు 31 మధ్య కాలంలో తొలగించిన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News