Share News

వీబీజీరామ్‌జీ ఉపాధి పనుల్లో ముందంజ

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:40 AM

గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి జీవనోపాధి కల్పనలో భాగంగా.. వీబీజీరామ్‌జీ పథకం కింద పల్లెల్లో అధికసంఖ్యలో పనులు చేపడుతున్నామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.

వీబీజీరామ్‌జీ ఉపాధి పనుల్లో ముందంజ
Dhanasari Anasuya Seethakka

  • ఒకేరోజు 5 లక్షల మంది కూలీలకు పని: సీతక్క

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి జీవనోపాధి కల్పనలో భాగంగా.. వీబీజీరామ్‌జీ పథకం కింద పల్లెల్లో అధికసంఖ్యలో పనులు చేపడుతున్నామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటినుంచి ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని కూలీలకు అధిక సంఖ్యలో పనులు కల్పిస్తున్నామని, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా కూలీలకు ఒకేరోజు ఉపాధి పని కల్పించి రికార్డు సృష్టించినట్లు ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.


కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం, నీటి వనరులను సంరక్షించడం, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే శాశ్వత ఆస్తులను సృష్టించడం అనే మూడు లక్ష్యాలతో వీబీజీరామ్‌జీ పనులు కొనసాగించాలని అధికారులకు సీతక్క సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:40 AM