ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:43 AM
ఎరువుల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయశాఖ అధికారి (ఏవో) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విభాగానికి పట్టుబడ్డారు.
ఎరువుల వ్యాపారి నుంచి 20వేలు తీసుకుంటుండగా అరెస్టు
సదాశివపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎరువుల వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయశాఖ అధికారి (ఏవో) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విభాగానికి పట్టుబడ్డారు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సదాశివపేట మండల వ్యవసాయ శాఖ అధికారి రమేష్.. ఎలాంటి సమస్యలు రాకుండా, వ్యాపారం సజావుగా నిర్వహించుకోవాలంటే రూ.30వేలు చెల్లించాలని పట్టణంలోని ఒక ఫర్టిలైజర్ షాపు యజమానిని డిమాండ్ చేశారు.
దీంతో ఎరువుల వ్యాపారి ముందస్తుగా రూ.10 వేలను ఏవో రమే్‌షకు అందజేశారు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. పట్టణంలోని మండల వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం మిగిలిన రూ.20వేలను వ్యాపారి నుంచి తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి.. ఏవో రమే్‌షను అదుపులోకి తీసుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News