Share News

అగ్నివీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:07 AM

భారత సైన్యంలో అగ్నివీర్‌ (జనరల్‌/ టెక్నికల్‌) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

అగ్నివీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Agniveer Recruitment

విజయనగరం బాబామెట్ట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): భారత సైన్యంలో అగ్నివీర్‌ (జనరల్‌/ టెక్నికల్‌) ఉద్యోగాల భర్తీకి (Agniveer Recruitment) పురుషుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఆర్మీ ర్యాలీలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అగ్నివీర్‌ జనరల్‌ కేటగిరీ కింద టెన్త్‌లో 40 శాతం మార్కులు, టెక్నికల్‌ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలని తెలిపారు. క్లర్క్స్‌, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు ఇంటర్‌‌లో ఏ గ్రూప్‌ అయినా సరే 60 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ నంబర్‌ 94943 34044ను సంప్రదించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

శాసనమండలిలో గందరగోళం.. శ్రీవారి లడ్డూ అంశంపై వాగ్వాదం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 05 , 2026 | 08:08 AM