తిరుమల శ్రీవారి ఆలయ మహాగోపురం ప్రత్యేకతలు ఇవే..
ABN , Publish Date - Oct 11 , 2026 | 01:38 PM
దేశంలో ఎన్నో ఎతైన, సౌందర్యవంతమైన గోపురాలున్నాయి. అయితే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ గోపురానికి మాత్రం ఓ ప్రత్యేకమైన కళ ఉంటుంది.
దేశంలో ఎన్నో ఎతైన, సౌందర్యవంతమైన గోపురాలున్నాయి. అయితే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ గోపురానికి మాత్రం ఓ ప్రత్యేకమైన కళ ఉంటుంది. గోపురాన్ని చూడాగనే మదిలో శ్రీనివాసుడు ప్రత్యక్షమవుతాడు. ఆలయ ప్రధాన ద్వారానికి పడికావలి, ముఖద్వారం, సింహాద్వారం, పెరియ తిరువాళల్ అనే వివిధ పేరున్నాయి. ఈ మహాద్వారానికి ఎతైన గోపురం నిర్మించటానికి అనువుగా పటిష్టమైన రాతి శిలలతో ద్వారానికి ఇరువైపులా, లోపలి భాగాల్లో చౌకట్టును నిర్మించారు. ఈ రాతి చౌకట్టుపై ఐదంతస్తుల గోపురాన్ని శిల్పకళాశోభితంగా నిర్మించారు.
ఈ గోపురం క్రీ.శ 13వ శతాబ్దం నుంచి అభివృద్ధి చెందినట్లు చారిత్రక ఆధారాలు న్నాయి. గోపురంపై కళ్లు మిరిమెట్లుగొలిపేలా సువర్ణ క లశాలుంటాయి. 1997లో మహాద్వారం గోపురానికి ఉండే తలుపులకు ఇత్తడి రేకులను అమర్చారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ ఈ గోపురం కింద నుంచే ఆలయంలోకి వెళ్లాల్సిఉంటుంది. ఉత్సవాలు, ప్రత్యేక దినాలు వస్తే చాలు... ఈ మహాద్వార గోపురం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతుంటుంది. తిరుమలకు వెళ్లాం అని చెప్పుకోవటానికి చాలామంది భక్తులు గోపురం వద్దే ఫొటోలు తీసుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News