Share News

రేపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తాము: మల్లికార్జున్ ఖర్గే

ABN , Publish Date - Oct 11 , 2026 | 01:19 PM

తాము రేపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో భేటీ అవుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం తెలిపారు.

రేపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలుస్తాము: మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge

ఇంటర్నెట్ డెస్క్: తాము రేపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో భేటీ అవుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం తెలిపారు. తనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, తాను సీజేఐకి లేఖ రాశామని తెలిపారు. రేపు సాయంత్రం 4-5 గంటల మధ్య సమావేశానికి అనుమతి కోరామని చెప్పారు. సర్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని చీఫ్ జస్టిస్‌కు వివరిస్తామని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ తన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మేము ఆయన ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టబోము. కానీ మా ఆందోళన గురించి ఆయనతో పంచుకుంటాము. ఈ విషయంలో కల్పించుకోవాలని చేతులు జోడించి అభ్యర్థిస్తాము’ అని ఖర్గే అన్నారు. l


ఈ సందర్భంగా ఖర్గే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని అన్నారు. ప్రధాని, హోం మంత్రి కలిసి దేశంలో నానా రచ్చ సృష్టించారని ఆరోపించారు. దీనిపై తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై కూడా ఆయన మండిపడ్డారు. ‘32 వేల మంది పోలీసులను, 7500 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. యువతను చూస్తే ప్రభుత్వానికి ఎంత భయమో దీన్ని చూస్తే అర్థం అవుతోంది’ అని అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చవండి:

రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..

రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్

Updated Date - Oct 11 , 2026 | 01:30 PM