రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:47 AM
హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా కూడా పాల్గొనే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, సైనిక జోక్యంపై అమెరికా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలోని రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన క్షిపణి దాడి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీంతో హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా కూడా పాల్గొనే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, సైనిక జోక్యంపై అమెరికా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు (Donald Trump, Saudi Arabia).
అక్టోబర్ 10న రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 12 మంది మరణించగా, 309 మంది గాయపడ్డారు. ఈ దాడి గురించి విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ స్పందించారు. 'హౌతీలపై సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో చేరే అవకాశాన్ని పరిశీలిస్తాం. పరిస్థితులను బట్టి త్వరగా నిర్ణయం తీసుకుంటాం. మేము చేరవచ్చు. తాజా దాడి గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. వీలైనంత వేగంగా నిర్ణయం తీసుకుంటాం' అని ట్రంప్ పేర్కొన్నారు (Riyadh airport attack).
యెమెన్‌లో ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ నేతృత్వంలోని కూటమి హౌతీ దళాలపై సైనిక చర్యలు చేపడుతోంది (Saudi Houthi conflict). ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ భూభాగంపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. రియాద్ విమానాశ్రయంపై అంతకుముందు జరిగిన దాడుల్లో ముగ్గురు సౌదీ పౌరులు మరణించారు. తాజా దాడుల్లో 12 మంది మరణించారు. వీరిలో సౌదీ అరేబియాకు చెందిన నలుగురు, బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. అమెరికా, జోర్డాన్, పాలస్తీనా, సిరియా, సూడాన్, ఈజిప్టుకు చెందిన ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి..
చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే