Share News

అంబానీ మద్దతుదారులపై మస్క్ ఆగ్రహం.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 11 , 2026 | 10:30 AM

తన స్టార్ లింక్ సేవలకు భారత్‌లో లైసెన్స్ రాకపోవడంపై ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి స్పందించారు. భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంబానీ మద్దతుదారులపై మస్క్ ఆగ్రహం.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు..
Elon Musk, Mukesh Ambani

ఇంటర్నెట్ డెస్క్: స్టార్ లింక్‌కు భారత్‌లో లైసెన్స్ రావడంలో జాప్యం జరుగుతుండడంపై ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి స్పందించారు. భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో, అంబానీ మద్దతుదారులు పరస్పర విరుద్ధమైన వాదనలు చేస్తున్నారని విమర్శించారు (Elon Musk, Mukesh Ambani).


స్టార్‌లింక్ రాకతో భారత వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయని, పోటీ పెరిగితే సేవల ధరలు తగ్గే అవకాశం ఉంటుందని మస్క్ అభిప్రాయపడ్డారు. 'స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో పోటీ పడలేదని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు అది గట్టి పోటీదారుగా మారుతుందని వాదిస్తున్నారు. ఇవి రెండూ పరస్పర విరుద్ధ వాదనలు' అని మస్క్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. స్టార్‌లింక్ సేవల ధరలు భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకపోతే వారు ఆ సేవలను కొనుగోలు చేయరని మస్క్ అన్నారు (Starlink India).


వినియోగదారులను ఆకర్షించేందుకు స్టార్‌లింక్ కూడా ధరలను తగ్గించాల్సి వస్తుందని పేర్కొన్నారు (Elon Musk Starlink controversy). స్టార్‌లింక్ ప్రవేశంతో అంబానీ వ్యాపార లాభాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన వ్యాపారం మూతపడిపోదని మస్క్ అభిప్రాయపడ్డారు. కాగా, స్టార్‌లింక్ సంస్థ భారత్‌లో సేవలను ప్రారంభించడంలో జరుగుతున్న జాప్యంపై మస్క్ గత కొన్ని రోజులుగా అంబానీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల 'ప్రధాని అంబానీ' అని వ్యంగ్యంగా సంబోధించారు.


ఇవి కూడా చదవండి..

చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..


ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 11 , 2026 | 10:40 AM