వైభవ్ నాలాగే ఆలోచిస్తున్నాడు: వీరేంద్ర సెహ్వాగ్
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:36 AM
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయాలనే సూర్యవంశీ ఆలోచనా విధానం తనను పోలి ఉందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి బంతి నుంచే బౌలర్లపై దాడి చేయాలనే సూర్యవంశీ ఆలోచనా విధానం తనను పోలి ఉందని పేర్కొన్నాడు. భారత జట్టు తరఫున యువ ఆటగాడికి మరిన్ని అవకాశాలు రావాలని అభిప్రాయపడ్డాడు. న్యూఢిల్లీలో శనివారం జరిగిన పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సమావేశంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు (Sehwag on Sooryavanshi).
ఆ సమావేశంలో సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై సెహ్వాగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. సూర్యవంశీ తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలని భావిస్తాడని, ఈ విషయంలో అతడి ఆలోచనలు తనకు దగ్గరగా ఉన్నాయని తెలిపాడు. భారత జట్టులో అతడికి ఎప్పుడు అవకాశం వస్తుంది? ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడు? అన్నది ఇప్పుడు ముఖ్యమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు ఆటగాడి వయసు కంటే అతడి ప్రతిభ, ప్రదర్శన ముఖ్యమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు (Vaibhav Sooryavanshi batting).
అండర్-19 వంటి వయోపరిమితి పోటీల్లో నిబంధనలు పాటించాల్సిందేనని, అయితే ఐపీఎల్ లేదా భారత సీనియర్ జట్టు తరఫున ఆడేటప్పుడు ఆటతీరే ప్రధాన ప్రమాణం కావాలని పేర్కొన్నాడు (Team India). '38 ఏళ్ల విరాట్ కోహ్లీ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వయసు ఆధారంగా కాకుండా ప్రదర్శనను బట్టి అవకాశాలు ఇవ్వాలి' అని సెహ్వాగ్ వివరించాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిలకడగా రాణిస్తున్నప్పుడు వేరే విషయాలపై దృష్టి పెట్టనవసరం లేదన్నాడు.
ఇవి కూడా చదవండి..
చెన్నైకి నేడు ప్రధాని మోదీ.. రూ.13 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..