Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:42 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.50 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,042

తలనీలాలు సమర్పించినవారు: 36,698


ఈ వార్తలు కూడా చదవండి:

మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంస్కరణల దిశగా భారత్‌

1,36,326 పోలింగ్‌ కేంద్రాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 06:42 AM