అర్జెంటీనా నూతన సారథి రొమిరో?
ABN , Publish Date - Sep 02 , 2026 | 06:03 AM
మెస్సీ రిటైర్మెంట్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు పెద్దలోటుగానే చెప్పుకోవాలి. ఈ రేసులో క్రిస్టియన్ రొమిరో, గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్...
న్యూఢిల్లీ: మెస్సీ రిటైర్మెంట్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు పెద్దలోటుగానే చెప్పుకోవాలి. ఈ రేసులో క్రిస్టియన్ రొమిరో, గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్, మిడ్‌ఫీల్డర్ అలెక్సిక్ మాక్ అలిస్టర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో కోచ్ స్కొలానీకి సన్నిహితుడిగా ముద్రపడ్డ రొమిరోకే అవకాశాలున్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మెస్సీ కన్నీళ్లు.. ఎంతో బాధిస్తున్నాయి: రొనాల్డో
మెస్సీ వీడ్కోలుపై పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే 2016లో మెస్సీ తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు రొనాల్డో చేసిన కామెంట్ మళ్లీ వైరల్‌గా మారింది. ‘మెస్సీ కఠిన నిర్ణయాన్ని తీసుకొన్నాడు. అతడికి ఓటములు, రెండో స్థానంలో నిలవడం ఇష్టం ఉండదు. మెస్సీ కన్నీళ్లు పెట్టుకొంటుంటే.. చూసేందుకు ఎంతో బాధగా ఉంది. అతడు మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని ఆకాంక్షిస్తున్నాన’ని రొనాల్డో అన్నాడు.
ఇవి కూడా చదవండి:
అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
పాకిస్థాన్ క్రికెట్‌లో అలజడి.. సెలెక్షన్ కమిటీకి మిస్బా ఉల్ హక్ రాజీనామా!