1,36,326 పోలింగ్ కేంద్రాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:53 AM
గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది.
13,278 గ్రామ పంచాయతీల్లో తుది జాబితా: పునేఠా
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించింది. పోలింగ్ కేంద్రాల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను గత నెల 12న రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం గత నెల 23న సంబంధిత మండల పరిషత్ అధికారులు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను ప్రకటించారు. వాటిపై అభ్యంతరాలు, క్లెయిములను గత నెల 26 వరకు స్వీకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో సోమవారం పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించారు. జిల్లాల నుంచి అందిన నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పరిశీలించి, రాష్ట్రంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,33,128 వార్డులకు మొత్తం 1,36,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.