Share News

మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంస్కరణల దిశగా భారత్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:59 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని వీఐటీ(విట్‌) విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంస్కరణల దిశగా భారత్‌

  • ప్రేమతో రాసే కార్డైనా ప్రోత్సాహాన్ని ఇస్తుంది: కేంద్ర మంత్రి పెమ్మసాని

  • 10 వేల కార్డులతో ప్రధానికి విట్‌ విద్యార్థుల జన్మదిన శుభాకాంక్షలు

తుళ్లూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని వీఐటీ(విట్‌) విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 10 వేల మంది స్టూడెంట్లు పోస్టు కార్డుపై శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రేమతో రాసిన చిన్న పోస్ట్‌కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్‌, బీజేపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ పాతూరు నాగభూషణం, విట్‌ అమరావతి ఉపకులపతి పి.అరుల్మొళివర్మన్‌, రిజిస్ర్టార్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి, విద్యార్థి సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 05:59 AM