Share News

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:48 PM

పోలీసులు ప్రజలతో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.

సమావేశాలు నిర్వహించి..  సమస్యలు తెలుసుకుని
హరిపురం: సువర్ణాపురంలో గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ తిరుపతిరావు

పోలీసులు ప్రజలతో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు.

ఫ హరిపురం, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): మందస మండలంలోని సువర్ణాపురం, పిడిమందసలో ఫెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు, మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గ్రామపెద్దలు, యువకులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు భీమారావు, వాసు, చిరంజీవి, జయరాజు పాల్గొన్నారు.

ఫ టెక్కలి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): టెక్కలి ఆదీఆంధ్రా వీధిలో పోలీసులు సోమవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ నారన్నాయుడు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

ఫ పోలాకి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని మబగాం, ఈదులవలసల్లోని పోలింగ్‌బూత్‌లను నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్‌ పరిశీలించారు. ఈమేరకు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఎన్నికలు సజావుగా జరిగే వరకూ ప్రజలు పోలీస్‌ వ్యవస్థకు సహకరించాలన్నారు. జూదం, మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు యువత దూరంగా ఉండాలన్నారు. కాగా గత ఏడాది వనవిష్ణుపురంలో ఓ వ్యక్తి హత్యకు గురికావడంతో అప్పటి నుంచి పికెట్‌ కొనసాగుతోందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఫహిరమండలం,సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు. మండంలోని కొమనాపల్లిలో పల్లెనిద్ర కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:48 PM